Ts Assembly: రేపటి నుంచి అసెంబ్లీ... ఏర్పాట్లపై సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్ష
రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన
హైదరాబాద్: రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్ భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనాను సమర్థంగా అరికట్టేందుకు కృషి చేసిన ప్రభుత్వం, అధికారులకు సభాపతి పోచారం అభినందనలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, నీతి ఆయోగ్ ఛైర్మన్ సైతం ప్రశంసించారని అన్నారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరిన ఆయన.. సభ్యులు అడిగే సమాచారాన్ని త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని చెప్పారు. సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోచారం సూచించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!