congress: 12న మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ జంగ్‌ సైరన్‌: మధుయాష్కీ

మహబూబ్‌ నగర్‌లో ఈనెల 12న విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ నిర్వహిస్తామని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి..

Updated : 30 Sep 2022 15:35 IST

హైదరాబాద్‌: మహబూబ్‌ నగర్‌లో ఈనెల 12న విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ నిర్వహిస్తామని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ... సైనిక పాలనను గుర్తు చేసేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదలకు విద్యను దూరం చేస్తూ .. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కేసీఆర్‌ను నిలదీస్తూ జంగ్‌ సైరన్‌ మోగించామని ప్రకటించారు.  అత్యంత సున్నితమైన చార్మినార్‌ వద్ద భాజపా సభకు అనుమతిచ్చిన సీఎం కేసీఆర్‌ .. కాంగ్రెస్‌ శాంతియుతంగా చేసే జంగ్‌ సైరన్‌ ర్యాలీకి ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించారు. 

అమరులకు నివాళి అర్పిస్తామంటే కేసీఆర్‌కు వెన్నులో ఎందుకు వణుకు పుడుతోందని నిలదీశారు. శ్రీకాంతాచారి విగ్రహానికి దండ వేయడానికి కూడా అంగీకరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి కొట్టారని, నిన్నటి దినం సిగ్గుపడాల్సిన రోజని వ్యాఖ్యానించారు. తెగింపుతో పోరాటం చేస్తున్న బల్మూరు వెంకట్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని, భవిష్యత్‌లో కూడా యువతకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. వెంకట్‌ పక్కటెముకలు విరిగినందున అతను కోలుకున్న తర్వాత  ప్రచారం మొదలుపెడతామని వివరించారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని