Published : 01/12/2021 01:45 IST

AP News: లోక్‌సభలో మరోసారి ప్రత్యేక హోదా అంశం.. కేంద్రం ఏం చెప్పిందంటే?

దిల్లీ: ప్రత్యేక హోదా అంశం లోక్‌సభలో మరోసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల దృష్ట్యా ప్రత్యేక హోదా ముగిసిన అంశమని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు అంగీకరించినట్టుు హోంశాఖ తెలిపింది. ‘‘విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయి. మిగతా అంశాలు పూర్తి చేసేందుకు సమయం ఉంది. విభజన చట్టం హామీల పూర్తికి 25 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. 2015-20 మధ్య కేంద్ర పథకాలకు 00: 10 నిష్పత్తితో ఇచ్చేందుకు అంగీకరించాం’’ అని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని