Updated : 22 Nov 2021 16:40 IST

UP polls 2022: యూపీలో పాగా వేసేందుకు మజ్లిస్ వ్యూహం.. 100 స్థానాల్లో పోటీ

లఖ్‌నవూ: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మజ్లిస్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకునే విషయంపైనా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భాజపా, సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్, కాంగ్రెస్​తో పాటు ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మరో పార్టీ ఎంఐఎం. పార్టీ మూలాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికల బరిలోకి దిగి, వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని భావిస్తున్నారు. మొత్తం యూపీ అసెంబ్లీలో 403 స్థానాలు ఉండగా.. 100 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు.

ఒంటరిగానా? కూటమితోనా?

దళితులు, ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది ఎంఐఎం. అయితే ముస్లిం ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆధారపడిఉన్న సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) ఓట్లను ఎంఐఎం చీల్చగలిగితే.. ఆ పార్టీకి అపార నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పొత్తుపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ఏర్పాటు విషయంపై ఒకట్రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పొత్తు విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపు మాత్రం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ, భాగీదారీ సంకల్ప్ మోర్చా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఒవైసీ గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఎంఐఎంతో పొత్తును సమాజ్​వాదీ పార్టీ ఇప్పటివరకైతే వ్యతిరేకించలేదు. ఈ నేపథ్యంలో సమాజ్​వాదీ కూటమిలో చేరే అవకాశం మజ్లిస్​కు ఇంకా మిగిలే ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని