AP News: శాసనసభలో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: వర్ల రామయ్య

ఏపీ అసెంబ్లీలో వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు

Updated : 25 Nov 2021 15:49 IST

విజయవాడ: ‘ఏపీ అసెంబ్లీలో వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు’ అనే నినాదంతో దీక్ష చేపట్టినట్లు తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య తెలిపారు. విజయవాడలోని స్వగృహంలో వర్లరామయ్య దంపతులు ఈ ఉదయం నిరసన దీక్ష ప్రారంభించారు. 12 గంటల పాటు రాత్రి 8.30 వరకు దీక్ష కొనసాగనుంది.

అసెంబ్లీలో జరిగిన ఘటనపై సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శాసనసభలో వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన చట్ట సభల్లో వ్యక్తిగత దూషణలు ఏంటని వర్ల రామయ్య నిలదీశారు. రెండున్నరేళ్లుగా అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు తొందరనే ఉన్నాయని ఆయన అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని