
Ys vijayamma: వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన సతీమణి విజయమ్మ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విజయమ్మ కుమార్తె షర్మిలతో కలిసి వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గతంలో వైఎస్‌తో సన్నిహితంగా మెలిగినవారు, అప్పటి మంత్రిమండలిలో, కాంగ్రెస్‌లో పనిచేసిన వారిని విజయమ్మ ఆహ్వానించారు. అనేక మంది ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని వైఎస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌కు ప్రజలకు మధ్య ఉన్న ప్రేమాభినామాలను అనిర్వచనీయమన్న విజయమ్మ.. ఆయన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయిన నేత వర్ధంతికి వెళ్లొద్దనడం పిచ్చి పని అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు వెళ్లిన కోమటిరెడ్డి సొంత పార్టీ నిర్ణయాన్ని విభేదించారు. తాను సభకు హాజరవ్వడంపై ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, కేవలం విజయమ్మకు ఇచ్చిన మాటకోసమే వెళ్లానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.