Vijayashanthi: తెలంగాణలో మహిళలకు భద్రత లేదు: విజయశాంతి

తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. సైదాబాద్‌...

Updated : 16 Sep 2021 16:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. సైదాబాద్‌ బాధిత కుటుంబాన్ని విజయశాంతి పరామర్శించారు. సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటని.. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదన్నారు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఉదయం ఆరు గంటలకు వచ్చి డబ్బులు ఇచ్చి నోరు మూసేద్దామనుకోవడం సమంజసం కాదని విజయశాంతి తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని