Vijaysai Reddy: ఆ రెండూ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయి: విజయసాయిరెడ్డి

విజయనగరం, విశాఖపట్నం రెండూ జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు...

Updated : 05 Sep 2021 19:55 IST

విశాఖపట్నం: విజయనగరం, విశాఖపట్నం రెండూ జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రస్తుత విశాఖ ఎయిర్‌పోర్టు రక్షణశాఖకు చెందినదే కాబట్టి వారికే అప్పగిస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టును కలుపుతూ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు విజయసాయి వివరించారు. విశాఖ- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. అన్నివిధాలుగా విశాఖ అద్భుత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు