TS News: భాజపా గూటికి చేరనున్న తెలంగాణ ఉద్యమకారుడు?

రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమకారుడు భాజపా గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస తొలి ప్రభుత్వంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా

Published : 02 Dec 2021 01:29 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమకారుడు భాజపా గూటికి చేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస తొలి ప్రభుత్వంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగిన మాజీ టీఎన్జీవో నేత విఠల్‌ తో భాజపా నేతలు చర్చలు జరుపుతున్నారు. విఠల్‌ కూడా భాజపాలో చేరేందుకు సముఖత చూపినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చేరేందుకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని