Harish rao: త్వరలో నేతన్న బీమా తీసుకొస్తాం: హరీశ్‌ రావు

పనిచేసే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను మంత్రి హరీశ్‌రావు కోరారు. భాజపా నేతలవి మాటలే తప్ప రాష్ట్రాభివృద్ధికి

Published : 13 Sep 2021 17:23 IST

హుజూరాబాద్‌: పనిచేసే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను మంత్రి హరీశ్‌రావు కోరారు. భాజపా నేతలవి మాటలే తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత కోసం చెక్కులను పంపిణీ చేశారు. నేతన్నల సంక్షేమానికి చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. ‘‘నష్టపోయిన కార్మిక కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి రూ.5 లక్షల నేతన్న బీమా కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వం తీసుకువస్తోంది. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా, గీతన్న బీమా, మత్స్యకారుల బీమాను చేపట్టనుందన్నారు. రానున్న రోజుల్లో సొంత స్థలాల్లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టించి ఇవ్వాలని తెరాస సన్నాహాలు చేస్తోంది’’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని