Updated : 21 Sep 2021 10:15 IST

AP News: తెదేపా మహిళా నేత ఇంటిపై రాళ్ల దాడి.. ఆరు బైక్‌లు దగ్ధం

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెదేపా మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటి వద్దకు వచ్చిన వైకాపా కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి దూరి సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రి, 6 ద్విచక్ర వాహనాలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడ ఉండగానే ఈ ఘటన జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. కొద్ది సేపటికి బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్సై లు నాగేంద్ర, రవీంద్రలు ఘటనా స్థలికి భారీగా సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడులకు దిగిన వారి కోసం ఆరా తీస్తున్నారు. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పర్రులో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు: శారదా

పక్కా ప్రణాళికతోనే తమ ఇంటిపై దాడి చేశారని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారదా మండిపడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని అసహనం వ్యక్తం చేశారు. తన భర్త పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను చూసి ఓర్వేలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని