
Raghurama: జగన్ దిల్లీ పర్యటనపై రఘురామ వ్యంగ్యాస్త్రాలు
దిల్లీ: సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించామని సీఎం జగన్ ప్రకటించుకుంటారని చెప్పారు. అయితే తనకున్న సమాచారం మేరకు తన విషయంతో పాటు బెయిల్ అంశంపై మాట్లాడతారని చెప్పారు. సినిమా టికెట్ల ధరలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రధానిని కలుస్తానని సీఎం జగన్ దిల్లీ వస్తున్నారు. ప్రధానితో ఫలవంతంగా ముగిశాయని చెబుతారు. ప్రత్యేక హోదాపై చర్చించామంటారు. మోదీతో 20నిమిషాలు భేటీ అయితే బయట వేచి ఉన్న సమయంలో కలిపి గంట చర్చించామంటారు’’ అని రఘురామ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.