Raghurama: విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు: రఘురామ

ఏపీలో విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు ఎదురవుతున్నాయని.. యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ..

Published : 19 Aug 2021 01:24 IST

దిల్లీ: ఏపీలో విచిత్ర పథకాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు కష్టాలు ఎదురవుతున్నాయని.. యాజమాన్యాలు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘‘నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటు బడుల్లో పని చేస్తున్న వారితో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో పాఠశాల నిర్వహకులైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై రఘురామ విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని