
Updated : 01 Jan 2022 09:11 IST
Raghurama: అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తా: ఎంపీ రఘురామ
దిల్లీ: కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఈ ఛార్జిషీట్ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని రఘురామ చెప్పారు. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Tags :