
Updated : 02 Nov 2021 14:28 IST
By election result: బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా విజయం
బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 90 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. వైకాపా ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైకాపాకు 1,12,072, భాజపాకు 21,661, కాంగ్రెస్కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికే సుధ విజయం ఖరారైపోయింది. ఇతర పార్టీలు దాదాపు పోటీ ఇవ్వలేకపోయాయని అధికార పార్టీ నేతలు తెలిపారు.
Tags :