
Hyd : షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ : బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను మేడిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. షర్మిల దీక్షకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆమె అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు అడ్డుపడటంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.