YS Sharmila: నిర్లక్ష్యపు నీడలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు: షర్మిల

సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

Updated : 30 Sep 2022 15:30 IST

నల్గొండ: సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వర్సిటీలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎదుట నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆరోపణలు చేశారు. అనంతరం ప్రతి మంగళవారం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టే నిరాహార దీక్షలో ఆమె కూర్చున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని