YS Sharmila: దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు: షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే సర్కారు స్పందిస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

Updated : 14 Sep 2021 14:06 IST

హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే సర్కారు స్పందిస్తుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. నిరుద్యోగులకు సంఘీభావంగా ఆమె ఇవాళ హనుమకొండలో నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. తాను పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు దీక్షలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతకు ముందు కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం వద్ద ఉన్న ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి దీక్షా స్థలికి చేరుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని