
Updated : 13 Nov 2021 15:13 IST
YS Sharmila: షర్మిల ‘రైతు వేదన’ దీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసులు దీక్షకు అనుమతివ్వని కారణంతో ఇందిరా పార్కు వద్ద ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించి అనంతరం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Tags :