
Ys Sharmila: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడంలేదు: వైఎస్ షర్మిల
కోస్గి: రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో షర్మిల పాల్గొన్నారు. పాలకులే బీసీలను ఎదగకుండా చేస్తున్నారని విమర్శించారు. వారిని ఇంకా కుల వృత్తులకే పరిమితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఏడేళ్లలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప.. బీసీలకు చేసిందేమిటని ప్రశ్నించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.