
Updated : 19 Oct 2021 16:56 IST
YS Sharmila: వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యంగా పాదయాత్ర: షర్మిల
కడప: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన లేదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రేపు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ‘‘తెలంగాణలోని ప్రతి పల్లెకు పోతాం.. ప్రతి గడపను తడతాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలంతా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ అని షర్మిల పేర్కొన్నారు.
ఇవీ చదవండి
Tags :