Ap News: తెదేపా పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించాం: వైకాపా

వైకాపా నేతల బృందం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

Updated : 28 Oct 2021 17:17 IST

దిల్లీ: వైకాపా నేతల బృందం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలుగుదేశం పార్టీపై ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెదేపా నేతలు లోకేశ్‌, పట్టాభి చేసిన పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ గుర్తిపును రద్దు చేయాలని  కోరామని వివరించారు. శాసనమండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని కోరామని తెలిపారు. తమ విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించిందని విజయసాయి వెల్లడించారు. తెదేపా కార్యాలయం, పట్టాభి నివాసంపై వైకాపా శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. అందుకు పోటీగా ఇవాళ వైకాపా నేతలు ఈసీని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు