
Updated : 29 Nov 2021 16:41 IST
AP News: అమరావతి రైతులకు వైకాపా ఎమ్మెల్యే సంఘీభావం
నెల్లూరు: పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు వైకాపాకు చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్రలో భాగంగా నెల్లూరు మీదుగా వెళ్తున్న రైతులు.. శాలివాహన ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డి అక్కడికి వెళ్లి వారిని కలిశారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని.. తప్పకుండా సహకరిస్తానన్నారు. ‘జై అమరావతి’ అనాలని రైతులు కోరగా శ్రీధర్‌రెడ్డి సున్నితంగా వారించారు. ఆ మాట అనేందుకు తనకు కొన్ని ఇబ్బందులున్నాయని వ్యాఖ్యానించారు.
Tags :