Eluru Elections: ఏలూరు కార్పొరేషన్‌ పీఠం వైకాపాదే

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైకాపా దక్కించుంది.

Updated : 25 Jul 2021 15:12 IST

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైకాపా దక్కించుంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడైన ఫలితాల్లో 47 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి.

ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం డివిజన్లలో సగం కంటే ఎక్కువ వైకాపా ఖాతాలో చేరడంతో ఆ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోనుంది. వైకాపా 44 చోట్ల, తెదేపా 3 స్థానాల్లో గెలుపొందాయి. 2, 4, 5, 6, 8, 10, 11, 13, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 సహా మరికొన్ని డివిజన్లలో వైకాపా.. 28, 37, 47 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తయింది. గతంలో ఏకగ్రీవమైన మూడు స్థానాలూ వైకాపా ఖాతాలోకే వెళ్లడంతో ఆ పార్టీ 47 డివిజన్లలో గెలుపొందినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని