
YS Sharmila: అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’: షర్మిల
హైదరాబాద్: ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. పాదయాత్రను చేవెళ్లలో ప్రారంభించి చేవెళ్లలోనే ముగించనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. తాను ప్రతి మంగళవారం చేపడుతున్న నిరాహార దీక్షను పాదయాత్రలోనూ కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. పాదయాత్రకు వైఎస్‌ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని.. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేయాలని సంకల్పించినట్లు షర్మిల తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.