Ap News: గీత దాటితే చర్యలు తప్పవు.. భరత్‌, రాజాకు జగన్‌ హెచ్చరిక

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైకాపా నేతల పంచాయితీ ముగిసింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే

Updated : 29 Sep 2021 12:17 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైకాపా నేతల పంచాయితీ ముగిసింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డి రెండు విడతలుగా భరత్, జక్కంపూడి రాజాతో భేటీ అయ్యారు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడి సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ఈ పంచాయితీ కొనసాగింది. ఇవాళ్టి సమావేశంపై రేపు మీడియాతో మాట్లాడతానని ఎంపీ భరత్‌ తెలిపారు. 

ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే.. 

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని