Nara Lokesh-yuvagalam: లోకేశ్‌ బహిరంగసభను అడ్డుకున్న పోలీసులు.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్‌ సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. 

Updated : 03 Feb 2023 17:23 IST

ఐరాల: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం బంగారుపాళ్యం కూడలి వద్దకు చేరుకున్నారు. బంగారుపాళ్యం కూడలిలో బహిరంగసభను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు వందలాది మంది పోలీసులు.. మరో వైపు తెదేపా శ్రేణులు బంగారుపాళ్యం కూడలికి భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. సభకు అనుమతిలేదని, ప్రజలతో ముఖాముఖి నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఎలాగైనా లోకేశ్‌ బహిరంగ సభను నిర్వహించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. లోకేశ్‌ ప్రచారవాహనంపై నుంచి ప్రసంగించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని లోకేశ్‌ , తెదేపా నేతలు బంగారుపాళ్యం కూడలిలోని ఓ భవనంపైకి ఎక్కారు. అక్కడి నుంచే ప్రజలనుద్దేశించి లోకేశ్‌ ప్రసంగం కొనసాగింది.

లోకేశ్‌ పాదయాత్ర ఎనిమిదోరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ప్రారంభమైంది. మొగిలి నుంచి ఇవాళ ఉదయం పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేశ్‌ కార్యక్రమం నిర్వహించారు. లోకేశ్‌ను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగారు. మొగిలి నుంచి 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర శుక్రవారం  సాయంత్రం బంగారుపాళ్యం కూడలికి చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు