YS Sharmila: వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Updated : 28 Mar 2023 14:09 IST

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలనుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తమ నేతలను ఎక్కడికి వెళ్లకుండా గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంత అని మరోసారి నిరూపితం అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సీఎం నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని