Nara Lokesh: ప్రొద్దుటూరులో లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. దేహశుద్ధి చేసిన కార్యకర్తలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

Updated : 01 Jun 2023 22:30 IST

ప్రొద్దుటూరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు జనం భారీగా తరలిరావడంతో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత లోకేశ్‌ పాదయాత్రగా వెళ్తున్న మార్గంలో వైకాపా కార్యకర్త కోడిగుడ్డు విసిరారు. ఆ గుడ్డు లోకేశ్‌ భద్రతా సిబ్బందిపై పడింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా నాయకులు, కార్యకర్తలు .. గుడ్డు విసిరిన వైకాపా కార్యకర్తకు దేహశుద్ధి చేశారు. పోలీసులు వైకాపా కవ్వింపు చర్యల్ని అడ్డుకోకపోవడంపై లోకేశ్‌ మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలంలోనే ఆగి నిరసన తెలిపారు. పోలీసులు సర్దిచెప్పడంతో లోకేశ్‌ విడిది కేంద్రానికి వెళ్లారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు