TS Highcourt: మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న తెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి

Published : 29 Jun 2022 01:52 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలన్న తెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో తెరాస తరఫున కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పోటీ చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్‌లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్‌ గెలుపొందినట్టు ప్రకటించారని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్‌ తిరస్కరించాలని, పిటిషన్‌లో సరైన కారణాలు చూపలేదని కొప్పుల ఈశ్వర్‌ కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు... కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. లక్ష్మణ్‌ పిటిషన్‌పై త్వరలో హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని