Chandrababu: వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర: చంద్రబాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కడప జైలులో ప్రాణహాని ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారి హత్యకు

Updated : 12 Feb 2022 17:07 IST

విజయవాడ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కడప జైలులో ప్రాణహాని ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వారి హత్యకు కుట్ర జరుగుతోందన్నారు. మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్‌గా ఉన్న వరుణ్‌ రెడ్డిని ఇప్పుడు కడప జైలర్‌గా నియమించారని చెప్పారు. వివేకా హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కడప జైలులో ఉన్నారన్నారు. కడప జైలర్‌గా వరుణ్‌ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. జగన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి సాయంతో వరుణ్‌ రెడ్డి ద్వారా వారికి ప్రాణహాని పొంచి ఉందని ఆరోపించారు. శనివారం విజయవాడ పటమటలోని తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయన్ను పరామర్శించారు. సీఐడీ అరెస్టు, తదనంతర పరిణామాలపై ఆరా తీశారు.  

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం జరిగినా.. పరిష్కారం కోసం తెదేపా ముందుంటుందన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబును అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారన్నారు. 33 మంది తెదేపా నేతలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ప్రతిఒక్కరి పక్షాన పోరాడి వైకాపా ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు. తప్పు చేసే ప్రతి అధికారీ తప్పించుకోలేరని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని