Kcr: కొందరు పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదు: కేసీఆర్‌

కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన భారాసకు ఎలాంటి నష్టం లేదని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Updated : 25 Jun 2024 17:12 IST

హైదరాబాద్‌: కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన భారాసకు ఎలాంటి నష్టం లేదని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారాసలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరిన అంశాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని సూచించారు. వైఎస్‌ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్‌ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో గులాబీ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తరచూ కలుస్తానని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని