చైనా దూసుకొస్తున్నా.. ‘రక్షణ’కు నిధులు పెంచరా?!

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగించిందని, ఇలాంటి పరిస్థితుల్లో......

Published : 04 Feb 2021 01:36 IST

కేంద్ర బడ్జెట్‌ 1% జనాభా కోసమేనంటూ రాహుల్ విసుర్లు

దిల్లీ: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ మందగించిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలను ఆదుకొనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. నిధులు మంజూరు చేస్తే ఆ పరిశ్రమలు నిలదొక్కుకునేవని అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని విమర్శించారు. భారత్‌ భూభాగంలోకి చైనా దూసుకొస్తున్న సమయంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తుతుంటే రక్షణ రంగానికి సరిగా నిధులు కేటాయించలేదని ఆక్షేపించారు. దేశ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును ప్రభుత్వం వినాలన్నారు. అనునిత్యం మన కోసం శ్రమిస్తున్న రైతులను శత్రువులుగా భావించొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. 

దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు తెలుపుతుంటే.. దిల్లీని కోటగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. రైతు సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. నిరసన తెలుపుతున్న అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దేశానికి మంచిది కాదన్నారు.  కరోనాతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలని సూచించారు. ప్రజల వినిమయాన్ని పెంచాలి తప్ప సరఫరా వైపే దృష్టి పెట్టడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2021-22తో 99శాతం మంది దేశ జనాభాకు మేలు జరుగుతుందని భావించానని, కానీ దేశంలో 1శాతం మందికి లబ్ధి చేకూరేలా ఉందని విమర్శించారు. ఎంఎస్‌ఎంఈలు, కార్మికులు, రైతులు, సైనిక బలగాల నుంచి డబ్బులు తీసుకొని కేంద్రం కేవలం 5 -10 మంది  జేబుల్లో పెడుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి..

ట్వీట్లు తొలగిస్తారా? చర్యలు తీసుకోవాలా? 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని