
Andhra News: ‘రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తాం’: తెదేపా నేతకు బెదిరింపులు
కమలాపురం: వైఎస్సాఆర్ జిల్లా కమలాపురంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని కాగితాలపై రాసి కారుకు అంటించారు. కమలాపురంలో రామాపురం గుడి వద్ద కారు నిలిపి ఉండగా ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక కారు ధ్వంసం చేసినట్లు తెదేపా నాయకులు భావిస్తున్నారు.
సాయినాథ్ కారుతో పాటు ఆయన ఇంటికి కూడా దుండగులు కాగితాలు అంటించారు. రాజకీయాలు నీకెందుకు అంటూ బెదిరిస్తూ రాసిన లేఖలు అంటించడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో సాయినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు కమలాపురంలో తెదేపా అధినేత చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Agnipath: ఆర్మీ, నేవీలో ‘అగ్నిపథ్’ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయ్..!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550
-
General News
Telangana News: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం... అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి