రాజకీయంగా బలోపేతమవుతాం: కోదండరాం
‘‘తెలంగాణ జన సమితి(తెజస) పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం.
హైదరాబాద్: ‘‘తెలంగాణ జన సమితి(తెజస) పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించుకున్నాం. ప్రజా సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం అవుతాం’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమరువీరుల ఆశయ సాధనకు తెజస కృషి చేస్తోందన్నారు. పైసలు కుమ్మరించి గెలవాలన్నదే తెరాస తాపత్రయం అని విమర్శించారు. ఆగస్టులో పార్టీ ప్లీనరీ నిర్వహించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
నిరుద్యోగం, పోడు భూములు, ప్రజా సమస్యలపై పోరాడతామని కోదండరాం తెలిపారు. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కై నీటి పంచాయితీపై నాటకమాడుతోందని ఆరోపించారు. ఆషాఢమాసం బోనాల సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలతో మొక్కులు చెల్లించుకోవాలన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!