ఫలితాలు రాకముందే.. టీఎంసీ అభ్యర్థి మృతి!

పశ్చిమబెంగాల్‌లో ఇంకా ఎన్నికలు పూర్తి స్థాయిలో ముగియకముందే విషాదం చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ఖర్దాహ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాజల్‌ సిన్హా కరోనాతో మరణించారు.

Published : 26 Apr 2021 01:18 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఇంకా ఎన్నికలు పూర్తి స్థాయిలో ముగియకముందే విషాదం చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ఖర్దాహ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాజల్‌ సిన్హా కరోనాతో మరణించారు. కొద్ది రోజుల కిందట మహమ్మారి బారిన పడిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్విట్‌ చేశారు. 

‘ఖర్దాహ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన కాజల్‌ సిన్హా మరణించడం బాధాకరం. ఆ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రజలకు సేవ చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రచారంలో విశ్రాంతి లేకుండా పోరాడారు. టీఎంసీకి సుదీర్ఘ కాలం అంకిత భావంతో సేవలు అందించారు. ఆయనను మేం మిస్సవుతున్నాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మమతా బెనర్జీ ట్వీట్‌లో వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని