సువేందు నామినేషన్‌ రద్దు చేయండి: టీఎంసీ  

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీలో ఉన్న నందిగ్రామ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. తప్పుడు వివరాలతో నామినేషన్లు దాఖలు చేశారంటూ.......

Published : 17 Mar 2021 20:16 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీలో ఉన్న నందిగ్రామ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. తప్పుడు వివరాలతో నామినేషన్లు దాఖలు చేశారంటూ ఇరు పార్టీలూ ఈసీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇటీవల మమతా బెనర్జీ ఆరు క్రిమినల్‌ కేసులు దాచి పెట్టారంటూ సువేందు అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతలు ఆయనపై లేఖ రాశారు. నందిగ్రామ్‌ నుంచి బరిలో ఉన్న సువేందు నామినేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సువేందుకు నందిగ్రామ్‌,  హాల్దియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని, దీన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 17 అనుమతించదని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ పేర్కొన్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం అభ్యర్థి ఒకేచోట ఓటరుగా ఉండాలని తెలిపారు. సువేందు హాల్దియా నుంచి నందిగ్రామ్‌కు ఓటు మార్చుకొనేందుకు మైగ్రేషన్‌ దరఖాస్తు చేసినప్పటికీ అందులో నివాసానికి సంబంధించి నకిలీ వివరాలు సమర్పించారని ఆరోపించారు. నందిగ్రామ్‌లోని నందనాయక్బార్‌లో నివాసం ఉంటున్నట్టు పేర్కొన్నప్పటికీ బీఎల్‌వో వెరిఫికేషన్‌కు వెళ్లినప్పుడు ఆయన అక్కడ లేరనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన గత ఆరు నెలల నుంచి అక్కడ నివాసం ఉండటంలేదని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని