ఎన్నికల వేళ తృణమూల్‌ కొత్త నినాదం

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తు్న్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. ‘బంగ్లాకు సొంత కుమార్తె....

Updated : 21 Feb 2021 15:14 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తు్న్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. ‘బంగ్లాకు సొంత కుమార్తె కావాలి’ అనే నినాదాన్ని ఆ పార్టీ శనివారం ప్రారంభించింది. ఓ వైపు తృణమూల్‌ పార్టీకి భాజపా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో స్థానికులు, బయటి వ్యక్తులు అన్న చర్చను ముందుపెట్టింది. మమతా బెనర్జీని బెంగాల్‌ కుమార్తెగా ఆ పార్టీ పేర్కొంది.

ఈ మేరకు కోల్‌కతా నగరవ్యాప్తంగా మమతా బెనర్జీ చిత్రం, నినాదంతో కూడిన హోర్డింగులు వెలిశాయి. కొన్ని ఏళ్లుగా బెంగాల్‌ కుమార్తె ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, బయటి వ్యక్తులకు ఆ అవకాశం ఇవ్వబోమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ వెల్లడించారు. ‘ఎలక్షన్‌ టూరిజం’ కోసమే భాజపా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారంటూ కొంతకాలంగా ఆ పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ నినాదం అందుకోవడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని