కోవర్టులపై పూర్తి సమాచారం: మధుయాష్కీ

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరా భవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి బోసు రాజు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు...

Published : 18 Jul 2021 01:31 IST

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరా భవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి బోసు రాజు, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కీ, కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేన్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. 

సమావేశం ముగిసిన తర్వాత మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ... ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రత్యేక కార్యాచరణ ఉంటుదని తెలిపారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక తెరాసలో భయం మొదలైందన్నారు. యూనివర్సిటీలకు వెళ్లి నిరుద్యోగంపై సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ భూముల వేలంలో పెద్ద కుంభకోణం ఉందని, దీనిపై న్యాయపోరాటంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ పోరాడతామన్నారు.  అవినీతి అధికారుల చిట్టాను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. పోడు భూములపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పార్టీలోని కోవర్డులపై పూర్తి సమాచారముందన్నారు. షర్మిల విమర్శలపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని మధుయాష్కీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని