Updated : 25 Apr 2022 14:48 IST

Revanth Reddy: తెరాసతో తెగదెంపులకే కేసీఆర్‌తో పీకే భేటీ: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక తెరాస, ఐప్యాక్‌తో పీకేకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారని వ్యాఖ్యానించారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ అన్నారు.

తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్‌ సంస్థ తెరాస కోసం పనిచేస్తుందని ప్రగతిభవన్‌లో రెండు రోజుల భేటీ అనంతరం ఆదివారం కేసీఆర్‌కు పీకే తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు. భాజపా వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని ఓడించగలమని పీకే సూచించినట్లు తెలిసింది. తాము భాజపా, కాంగ్రెస్‌లతో సమదూరం పాటిస్తామని కేసీఆర్‌.. పీకేకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో పీకే భేటీపై రేవంత్‌ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts