
Revanth Reddy: అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు: రేవంత్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
‘‘అక్కంపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రెవెన్యూ గ్రామ హోదా కూడా లేదు. అక్కంపేటపై అలక్ష్యం.. జయశంకర్పై అక్కసును చాటుతోంది. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని.. అక్కంపేటలో ఓ కుటుంబాన్ని చూస్తే అర్థమైంది. వరంగల్ ఓఆర్ఆర్ కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఓఆర్ఆర్ మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది. దీని వల్ల లక్షమందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు. భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతులు దినదినగండంగా గడుపుతున్నారు. ఓఆర్ఆర్ జీవో ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రైతుల తరఫున క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది’’ అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి