Revanth Reddy: పోలీసుల అదుపులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన 

Updated : 17 Feb 2022 10:46 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. తొలుత లంగర్‌హౌస్‌ పీఎస్‌ వైపు తీసుకెళ్లిన పోలీసులు.. చివరకు గోల్కొండ పీఎస్‌కు తరలించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం సహా, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇటీవల రేవంత్‌ అన్నారు. అందుకు ప్రతిగా కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వివిధ రకాలుగా నిరసనలు తెలిపాలని యువజన కాంగ్రెస్‌కు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కేసీఆర్‌ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు: కాంగ్రెస్‌

రేవంత్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఇది అక్రమం, అప్రజాస్వామికమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో నిర్బంధకాండ అమలవుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా అడ్డుపడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని