
Revanth Reddy: ‘మూసీ’ ప్రాంతంలో పర్యటిస్తా
హైదరాబాద్: భాగ్యనగరం ‘తెలంగాణ గుండె’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచిన రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల పన్నులు పెంచారని విమర్శించారు. రూ.800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని చెప్పి.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలాలు, చెరువులు కబ్జా అయ్యాక చర్యలు అంటున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కబ్జాలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే వాటిని అమర్చడం లేదని ఆరోపించారు. తూతూ మంత్రంగా మూసీ అభివృద్ధి చర్యలు చేపట్టారని.. త్వరలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు.
ఇవీ చదవండి
Advertisement