Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్‌

నిజామాబాద్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు.

Updated : 03 Oct 2023 20:12 IST

హైదరాబాద్‌: ప్రధాని మోదీ నోటి నుంచి చీకటి మిత్రుడి మాట బయటకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘ముసుగు తొలగింది.. నిజం తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. మోదీ- కేసీఆర్‌ది విడగొట్టలేని బంధమంటూ కాంగ్రెస్‌ చెప్పిన మాట వాస్తవమేనని తేలిందన్నారు. నిజామాబాద్‌ సాక్షిగా మరోసారి వారిద్దరి బంధాన్ని మోదీ బయటపెట్టారన్నారు. ‘‘ వారిద్దరూ చీకటి మిత్రులు. దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని మేం చెబుతూనే ఉన్నాం. అదే నిజమైంది. కేసీఆర్‌ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నించింది నిజమే. వారిద్దరూ చీకటి మిత్రులేనన్నది పచ్చి నిజం. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడక తప్పదు’’ అని రేవంత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని