
Congress: ఈశాన్యంలో కాంగ్రెస్‌కు మరో షాక్.. త్రిపుర చీఫ్ రాజీనామా
అగర్తల: ఈశాన్య రాష్ట్రాల్లో పూర్వ వైభవం కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు పీజూష్ విశ్వాస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ చీఫ్‌గా ఇన్నాళ్లు పనిచేసిన తనకు సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిజూష్ విశ్వాస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసోంకు చెందిన కాంగ్రెస్ నేత, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుష్మితా దేవ్ తృణమూల్‌లో చేరారు.
బెంగాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఊపు మీద ఉంది. కేవలం బెంగాల్లోనే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పలువురు తృణమూల్ కార్యకర్తలు అగర్తల వీధుల్లో ‘ఖేలా హోబె’ (ఆట మొదలైంది) నినాదాలతో ఇటీవల హోరెత్తించారు. భాజపాను ఓడించేందుకు కలిసి రావాలని సీపీఎం సహా ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే టీఎంసీలో చేరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- ఇటు బుమ్రా.. అటువరుణుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..