
MLC Elections: ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెరాస అభ్యర్థులు
హైదరాబాద్: శాసన సభ్యుల కోటా నుంచి ఆరుగురు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో అధికారులు ఎన్నికను లాంఛనంగా ప్రకటించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఆర్వో ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. మరోవైపు గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మధుసూదనాచారితో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరిలలో ఒక్కరికి మండలి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది. సుఖేందర్‌రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. బండ ప్రకాశ్‌కు మండలి వైస్ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.