తెరాసకు ప్రత్యామ్నాయం లేదు: గంగుల 

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ ప్రత్యామ్నాయాలకు ఆయన చురకలంటించారు. ..

Updated : 09 Feb 2021 15:45 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఆయన చురకలంటించారు. తెరాసలో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని వివరణ ఇచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మా పార్టీ ఉన్నన్ని రోజులూ వేరే పార్టీ మనుగడ సాధించలేదు. మా పార్టీకి, మా నేత కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు, రాదు. ప్రజలందరూ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్న ప్రజలు వేరే శక్తులొచ్చి ఫ్యాక్షనిజం చేస్తామంటే ఒప్పుకోరు’ అని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు తేవాలని మంత్రి గంగుల డిమాండ్‌ చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదని ప్రశ్నించారు. కులాల ఆధారంగా జనాభా గణన జరగాలన్నారు. ఎంబీసీ అంటే భాజపా నేతలకు తెలుసా.?అని ఎద్దేవా చేశారు. ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు.  

ఇవీ చదవండి..
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల

భార్గవరామ్‌.. గుంటూరు శ్రీను ఎక్కడ?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని