Telangana news : రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడండి : సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ ఎంపీలకు సూచించారు...

Published : 31 Jan 2022 01:01 IST

రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో ఆయన చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్‌ అంశాలతోపాటు, రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని, చట్టపరంగా, న్యాయపరంగా రావాల్సినవి కూడా రాలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.మరోవైపు కేంద్ర బడ్జెట్‌ చూసి అందుకనుగుణంగా స్పందిస్తామని తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ కేంద్రం దృష్టికి ఇప్పటికే పలు అంశాలను తీసుకెళ్లారని, 23 అంశాలతో కూడిన నివేదికను ఇచ్చారని అన్నారు. విభజనచట్టంలోని హామీలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తామన్నారు. మరోవైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందని నేపథ్యంలో పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి తెరాస దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం,

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని