Telangana News: పార్లమెంట్‌లో తెరాస ఎంపీల వాయిదా తీర్మానం.. వాకౌట్‌

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ధాన్యం

Updated : 05 Apr 2022 12:43 IST

దిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ధాన్యం సేకరణపై చర్చించాలని తెరాస ఎంపీలు పార్లమెంట్‌ ఉభయసభల్లో పట్టుబట్టారు. అనంతరం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. ధాన్యం సేకరణపై చర్చ చేపట్టకపోవడంతో ఉభయసభల నుంచి ఎంపీలు వాకౌట్‌ చేశారు. అంతకముందు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా లోక్‌సభలో ఎంపీలు ఆందోళన చేపట్టారు. అనంతరం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని