presidential Election: మమతా బెనర్జీ సమావేశానికి తెరాస దూరం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాకూడదని తెరాస నిర్ణయం తీసుకుంది.

Published : 15 Jun 2022 02:15 IST

హైదరాబాద్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాకూడదని తెరాస నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరూ హాజరుకాకూడదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇదే విషయంపై ప్రగతిభవన్‌లో సీనియర్‌ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించడంపై తెరాస అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమవైఖరి తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. భాజపా, కాంగ్రెస్‌కు సమదూరం పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.  

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే విపక్షాలు కసరత్తు చేపట్టాయి. మరోవైపు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకువేసి విపక్షాలతో భేటీకి నిర్ణయించారు. ఈ నెల 15న దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశం కావడానికి పలువురు విపక్షాల ముఖ్యమంత్రులు, పలు పార్టీలను ఆహ్వానించింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఈ సమావేశానికి వెళ్లాలా? వద్దా? అని పలువురు పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని